ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఇంట విషాదం

ఇటీవల కాలంలో కరోనా కారణంగా పలువురు సినీ ప్రముఖులను లేదా వారి కుటుంబ సభ్యులను కోల్పోవడం జరిగింది. అన్ని భాషలకు చెందిన వారు కూడా ఈ సమయంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ ఇంట విషాదం నెలకొంది. రామ్‌ తాతగారు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై రామ్‌ మరియు ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ లో రామ్‌… లారీ డ్రైవర్‌ గా విజయవాడలో కెరీర్‌ ను ఆరంభించి, లారీ టైర్ల కింద పడుకున్న మీరు ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడ్డారు. మీరు ఒక రాజు మాదిరిగా కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకుని అందరి కోసం జీవించారు. మీరు మమ్ములను ఇంత పెద్ద వారిని చేయడంతో పాటు సమాజంలో గుర్తింపు ఉన్న వారిగా మార్చినందుకు థ్యాంక్యూ తాతగారు అంటూ ట్వీట్‌ చేశాడు. రామ్‌ తాత గారు ఎలా చనిపోయారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఏజ్‌ ఎక్కువ కనుక అనారోగ్య సమస్యల వల్ల చనిపోయి ఉంటారని టాక్ వినిపస్తుంది. రామ్‌ అభిమానులు మరియు ఇండస్ట్రీలో రామ్‌ కు సన్నిహితంగా ఉండే వారు అంతా కూడా రామ్‌ కు సానుభూతి తెలియజేస్తున్నారు.


Recent Random Post: