బంగార్రాజులో ‘వకీల్ సాబ్‌’ ఏంటో?

గత అయిదు సంవత్సరాలుగా నాగార్జున బంగార్రాజు సినిమా గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాత్రను ఆధారంగా చేసుకుని దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కథను సిద్దం చేశాడు. సినిమా కోసం నాగార్జున కూడా సిద్దం అయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ లోనే ఈ సినిమాను రూపొందించబోతున్నారు. నాగార్జునతో పాటు ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్‌, సమంతలు నటించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలోనే మరో స్టార్‌ ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రచారం మొదలయ్యింది.

ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వకీల్‌ సాబ్‌ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సమయంలోనే బంగార్రాజు లోని కీలక పాత్రకు గాను పవన్‌ కళ్యాణ్‌ ను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని కీలకమైన పావు గంట గెస్ట్‌ రోల్‌ ను పవన్ తో చేయించడం వల్ల సినిమాకు మరింత ఆకర్షణ వస్తుందని నాగ్‌ భావించి పవన్ ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాడట. మరి పవన్‌ ఒప్పుకుంటాడా అనేది చూడాలి.


Recent Random Post: