అఖండ.. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లాక్ అవుతుందిట

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అఖండ. వరస ప్లాపుల మధ్య ఉన్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అఖండ టీజర్ విడుదలయ్యాక ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. బోయపాటి ఫామ్ లో లేకపోయినా బాలయ్య సినిమా అనేసరికి మాస్ అంశాలపై బాగా దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఇక అఖండ చిత్రం గురించి బయటకు వస్తోన్న ఒక్కో న్యూస్ కూడా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్ర ఇంటర్వెల్ బ్లాక్ నిజంగా మైండ్ బ్లాంక్ చేస్తుందని అంటున్నారు. టీజర్ లో చూపించిన పవర్ఫుల్ డైలాగ్, యాక్షన్ వెర్షన్ ఇంటర్వెల్ బ్లాక్ గా డిజైన్ చేసాడట.

అలాగే ఈ ఎపిసోడ్ దగ్గరే సెకండ్ బాలయ్య ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అభిమానులకు పూనకాలు రప్పించే సీక్వెన్స్ గా బోయపాటి ఈ మొత్తం ఎపిసోడ్ ను తీర్చిదిద్దాడట.


Recent Random Post: