వీరమల్లు ఫ్యాన్స్కు బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజ్

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడు కనిపించని విధంగా హరి హర వీరమల్లు సినిమాలో కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడు కూడా ఛారిత్రాత్మక నేపథ్యంలో సినిమా ను చేయని పవన్ మొదటి సారి క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక విభిన్నమైన నేపథ్యంలో పవన్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా చాలా పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా చిన్న వీడియో వచ్చి మరింతగా సినిమాపై అంచనాలు పెంచేసింది.

హరి హర వీరమల్లు సినిమా నుండి మరిన్ని సర్ ప్రైజ్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ బర్త్ డే సందర్బంగా టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఆగస్టులో నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారనే టాక్ వస్తుంది. ప్రతి సందర్బంకు తగ్గట్లుగా క్రిష్ ఏదో ఒక పోస్ట్ లేదా టీజర్.. వీడియో ఇలా విడుదల చేస్తూ అన్ని వర్గాల వారిలో సినిమాపై అంచనాలు పెంచేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.

పవన్ ను ఈ సినిమాలో క్రిష్ దొంగగా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే లీక్ వచ్చింది. ఆ సినిమా పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెస్ ను కూడా నటింపజేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమా నుండి వన్ బై వన్ టీజర్.. పోస్టర్.. మేకింగ్ వీడియో అంటూ వస్తే సినిమా పై అంచనాలు మరింత పీక్స్ కు వెళ్లడం ఖాయం కదా…!


Recent Random Post: