హరిహర కంటే ముందే హరీష్ సినిమా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా బ్రేకులు పడింది. ఇక ఈ సినిమా పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ ను చేస్తాడన్న న్యూస్ ఉంది.

కానీ దీనిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముందుగా మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తూనే మరోవైపు హరీష్ శంకర్ చిత్రాన్ని కూడా మొదలుపెడతాడు.

నిజానికి హరిహర వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలో విడుదల కావాల్సి ఉంది. అయితే వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హరిహర వీర మల్లు కంటే ముందే హరీష్ శంకర్ సినిమా విడుదలవుతుంది అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.


Recent Random Post: