టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూనే ఉంది. సాదారణంగానే జక్కన్న సినిమా అనుకున్న సమయంకు ఆలస్యంగా ఏడాదికి గాను వస్తుంది. కాని కరోనా వల్ల ఆ ఆలస్యం కాస్త రెండు సంవత్సరాలు అయ్యేలా ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ దాదాపుగా ముగిసింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాని మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన రెండు పాటల చిత్రీకరణ మరియు క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది.
ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపుగా రెండు నెలల నైట్ డేస్ కావాలట. అంటే సినిమా షూటింగ్ మొత్తంను పూర్తి చేయాలంటే 60 వర్కింగ్ డేస్ అవసరం. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. జూన్ లేదా జులైలో షూటింగ్ పునః ప్రారంభం అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ కు సినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ లో సినిమా ను విడుదల చేయాలని జక్కన్న టీమ్ ఆశ పడుతుంది. మరి అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.
Recent Random Post: