టీ పోలీసులపై రాజమౌళి ఫిల్మ్‌

కరోనా సమయంలో తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించేందుకు సిద్దం అయ్యాడు. పోలీసు బాసులను ఇటీవలే కలిసిన ఆయన డాక్యుమెంటరీ విషయమై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. కొన్ని రియల్ సంఘటనలు మరియు కొన్ని చిత్రీకరించిన సంఘటనలతో డాక్యుమెంటరీ ఉంటుందని పోలీసు వర్గాల వారు చెబుతున్నారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ దాదాపుగా 20 నిమిషాలు ఉంటుందని అంటున్నారు. పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన రీసెర్స్‌ చేసి ఈ సమయంలో పోలీసులు ఎదుర్కన్న పరిస్థితులు మృతి చెందిన వారికి సంబంధించిన ఫొటోలు వీడియోలను కూడా ఇవ్వబోతున్నారట. రాజమౌళి సినిమా అంటే మరో రేంజ్ లో ఉంటుంది. కనుక ఈ షార్ట్ ఫిల్మ్‌ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: