నా కుటుంబం నీకు ఫ్యాన్స్ అయిపోయాం – రకుల్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం ఎక్కడ చూసినా ది ఫ్యామిలీ మ్యాన్ 2 హవానే కనిపిస్తోంది. మొదటి సీజన్ భారీ సక్సెస్ సాధించిన విషయం తెల్సిందే. రెండో సీజన్ దానికి తగ్గ రేంజ్ లోనే ఉందని చూసిన వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు. ఇక సెకండ్ సీజన్ లో మనోజ్ బాజ్పాయ్ క్యారెక్టర్ అద్భుతంగా పండిందని అంటున్న విషయం తెల్సిందే.

దాంతో పాటు సమంత పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. రాజీ అనే తిరుగుబాటుదారుని పాత్రను పోషించింది సమంత. నెగటివ్ ఛాయలున్న డీగ్లామ్ రోల్ ను పెర్ఫెక్ట్ గా పోషించిందని కితాబులు అందుతున్నాయి.

ఇదిలా ఉంటే ది ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. సిరీస్ అద్భుతంగా ఉందని మనోజ్ బాజ్పాయ్ నటన గురించి పొగడడానికి మాటలు సరిపొవట్లేదని తెలిపింది. అలాగే తనతో పాటు తన కుటుంబం అంతా సమంతకు వీరాభిమానులు అయిపోయారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


Recent Random Post: