యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా వరుస చిత్రాలతో దూసుకు పోతున్నాడు. ఈ సమయంలో ఈయన మ్యాజిక్ నెంబర్ 25కు చేరువ అయ్యాడు. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయబోతున్నారు అనే విషయమై ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు. దిల్ రాజు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సలార్ చేస్తున్న ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో దిల్ రాజు మరో సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. చాలా కాలంగా దిల్ రాజు తీవ్రంగా ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఇప్పటికి వర్కౌట్ అయ్యిందట. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా దిల్ రాజు సినిమా చేసేందుకు ప్రయత్నించాడు. చివరకు మరోసారి సలార్ కాంబోను సెట్ చేసే అవకాశం దిల్ రాజుకు వచ్చింది. ఈ మూవీ 2023 లో ఉండే అవకాశం ఉందంటున్నారు.
Recent Random Post: