మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా మొదట ప్రకాష్ రాజ్ ప్రకటించాడు. ఆ తర్వాత మంచు హీరో మోహన్ బాబు తనయుడు విష్ణు కూడా మా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. వీరిద్దరి మద్య పోటీ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్న సమయంలో జీవిత రాజశేఖర్ కూడా పోటీకి సిద్దం అయ్యింది. దాంతో మంచు విష్ణు కు గెలుపు అవకాశాలు తగ్గవచ్చు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో జీవిత రాజశేఖర్ తో మంచు విష్ణు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆమె ఈసారి అధ్యక్షురాలిగా ఎన్నిక అయ్యేందుకు పోటీ చేయబోతున్నారు. మంచు విష్ణు ఆమెను తన పానల్ లో జాయిన్ అయ్యి ఈసారి కూడా జనరల్ సెక్రటరీగా ఉండాలని.. తనకు ప్రెసిడెంట్ గా మద్దతు తెలపాలంటూ కోరుతున్నాడు. మరి ఇందుకు జీవిత రాజశేఖర్ ఒప్పుకుంటుందా అనేది చూడాలి.
Recent Random Post: