నివేదా పేతురాజ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మెంటల్ మదిలో సినిమాతో.. ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన ఈ భామ కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు కదలట్లేదు. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో కనిపించినా… ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం అమ్మడు నటించిన పాగల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయగా.. డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడట. కానీ ఆ ఫుడ్ లో ఓ బొద్దింక దర్శనం ఇవ్వడంతో నివేదా పేతురాజ్ ఖంగుతింది. వెంటనే ట్విటర్ ద్వారా స్విగ్గీ సంస్థకు కంప్లైట్ చేసింది. ఇలా.. నాణ్యతా ప్రమాణాలు పాటించని.. రెస్టారెంట్లను తమ ఫ్లాట్ ఫాం నుంచి తొలగించాలని స్విగ్గీని కోరింది. అంతే కాకుండా తనకు ఇలా జరగడం ఇది రెండో సారని.. ఇలాగే ఒకసారి కూడా ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింక వచ్చిందని వాపోయింది. స్విగ్గీ సంస్థ ఆ ట్వీట్ కు స్పందిస్తూ… ఆర్డర్ ఐడీ చెప్పాలని కోరింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Recent Random Post: