యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల లైన్ అప్ చేస్తూ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అద్బుతమైన సినిమాలను రాబోయే రోజుల్లో ప్రభాస్ అభిమానుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇండియా లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్ లో కూడా ప్రభాస్ కు మంచి గుర్తింపు రావడం ఖాయం అంటున్నారు. ఇక నాగ్ అశ్విన్ చేయబోతున్న సినిమా ఒక అద్బుత ప్రపంచానికి తీసుకు వెళ్తుందని అంటున్నారు. ఆయన ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. విశ్వసనీయంగా అందుతున్న ఈ సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ సభ్యులు ఇంజనీరింగ్ పట్టభద్రులను ఇంటర్వ్యూ చేసి మరీ ఎంపిక చేస్తున్నారట.
మెకానికల్, రోబోటిక్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లో మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రభాస్ టీమ్ ఆహ్వానం పలికింది. వారితో చిత్ర యూనిట్ సభ్యులు ఏం చేయించబోతున్నారు అనేది ఆసక్తికర అంశంగా మారింది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీ అంటూ ఇప్పటికే యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరో వైపు వీరిని తీసుకున్నారు కనుక ఖచ్చితంగా ఈ సినిమా లో రోబోలు ఉంటాయేమో అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. వచ్చే ఏడాది ప్రారంభం లో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టి 2023 లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.
Recent Random Post: