యంగ్ హీరో అల్లు శిరీష్ తన సోదరుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాటలో నడుస్తున్నాడు. ఫిజిక్ – ఫ్యాషన్ పరంగా తనను తాను మేకోవర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఫిట్నెస్ గోల్స్ గురించి ఇన్స్పైరింగ్ వీడియో రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్న శిరీష్.. ఇప్పుడు ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసుకోవడంలో బిజీగా వున్నాడు. లేటెస్టుగా యువ హీరో ఫ్యాషన్ కు సంబంధించిన ఓ షార్ట్ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో అల్లు శిరీష్ బ్లాక్ టీ షర్ట్ మరియు జీన్స్ కు జతగా జాకెట్ ధరించి షార్ప్ లుక్ లో కనిపిస్తున్నాడు. బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. ఈ వీడియోకి నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శిరీష్ ని చూస్తుంటే స్టైలింగ్ లో బన్నీ కే పోటీ వచ్చేలా ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ‘గౌరవం’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు వారబ్బాయి.. సినిమా సినిమాకి తనని తాను మార్చుకుంటూ వస్తున్నాడనే చెప్పాలి.
ప్రస్తుతం శిరీష్ ”ప్రేమ కాదంట” అనే సినిమాలో నటిస్తున్నాడు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ ప్రీ లుక్ పోస్టర్స్ – ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Recent Random Post: