వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ముఖ్యంగా ఆయన పాద యాత్రకు సంబంధించిన సంఘటనలు మరియు సన్నివేశాల ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర. మమ్ముట్టీ ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి గా కనిపించాడు. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈయన జగన్ కథతో సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జగన్ రాజకీయాల్లోకి రావడం మరియు సొంత పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చేందుకు పడ్డ కష్టంను సినిమాలో చూపించబోతున్నారట.
స్కామ్ 1992 లో అద్బుత నటన కనబర్చిన ప్రతీక్ గాంధీని ఈ సినిమాకు గాను జగన్ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. రాజకీయ పార్టీ పెట్టడం నుండి మొదలుకుని జగన్ సీఎం అయ్యి నవరత్నాలు అమలు చేసే వరకు కథ సాగుతుందని అంటున్నారు. ఆయన్ను ముందు ముందు కూడా సీఎంగా స్థానిక ప్రజలు చూడాలని కోరుకుంటున్నట్లుగా సినిమాలో చూపిస్తారని టాక్. మొత్తానికి తండ్రి బయోపిక్ చేసిన దర్శకుడు ఇప్పుడు కొడుకు బయోపిక్ చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు.
Recent Random Post: