కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్

తెలంగాణలో కొత్త విజన్ తో తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థ ద్వారా దేశంలోనే అత్యధికంగా 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి ఉద్యోగ, విద్యావకాశాల్లో సమాన వాటా దక్కుతుందని అన్నారు. సుదీర్ఘ కసరత్తు, మంచి విజన్ తో సీఎం కేసీఆర్ ఉమ్మడి ఏపీలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారన్నారు.

జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడం వల్ల జూనియర్ అసిస్టెంట్లు, జోనల్, మల్టీ జోన్లుగా అన్ని స్థాయి ఉద్యోగాల్లో సమాన అవకాశాలు దక్కుతాయన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 1,33,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకు అందించిందని అన్నారు. ఏడేళ్లలో టీఎస్ఐపాస్ ద్వారా లక్షల కోట్ పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలో ఆకర్షించాయన్నారు. దీని ద్వారా దాదాపు 15లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోకి వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు.


Recent Random Post: