దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ కోసం అడవుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్..!

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంతో మంది యంగ్ టాలెంట్ ని పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా అభిరామ్ ని లాంచ్ చేస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ”అహింస” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవలే ఈ చిత్రాన్ని ఎలాంటి హడావిడి లేకుండా హైదరాబాద్ లో ప్రారంభించారు. అయితే అభిరామ్ డెబ్యూ మూవీ కోసం మేకర్స్ ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ కు బయలు దేరినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లోని పన్నా అడవుల్లో దర్శకుడు తేజ – మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ – గేయ రచయిత చంద్రబోస్ సంగీత చర్చలు ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆర్పీ పట్నాయక్ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. ”ఈ కాంబోతో సంగీతంలో బ్యాంగ్ ప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని డీప్ ఫారెస్ట్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో రాబోయే చిత్రానికి ఫెంటాస్టిక్ మ్యూజిక్ కుకింగ్ మొదలైంది. వరుసగా అప్ డేట్స్ ఇస్తుంటాం. మేము మీ అంచనాలను అందుకోబోతున్నాం. వేచి ఉండండి” అని ఆర్.పి.పట్నాయక్ తెలిపారు.

కాగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్పీ పట్నాయక్ పరిచయం అయ్యారనే విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ తేజ – ఆర్పీ చేతులు కలుపుతున్నారు. వీరికి హార్ట్ టచ్చింగ్ లిరిక్స్ అందించే గేయ రచయిత చంద్రబోస్ కూడా కలవడంతో అభిరామ్ డెబ్యూ సినిమా మ్యూజికల్ బోనంజా అవుతుందని భరోసా ఇస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


Recent Random Post: