మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గారు చాలా కాలం గా కోరుకుంటున్న విషయం ఆచార్య సినిమా తో నెరవేరిపోయింది. చిరంజీవి మరియు చరణ్ లు కలిసి నటించాలి అనేది ఆమె కోరిక. ఆ విషయాన్ని చిరంజీవి మరియు చరణ్ లు పలు సందర్బాల్లో అన్నారు. ఇప్పుడు ఆచార్య సినిమాలో నటించడం వల్ల ఆమె కోరిక మాత్రమే కాకుండా మెగా అభిమానుల అందరి కోరికను వారు తీర్చేశారు. ఆచార్య సినిమా లో మొదట చరణ్ ఉంటాడని ఎవరికి తెలియదు. కనీసం చిత్ర యూనిట్ సభ్యులు అయినా అనుకున్నారో లేదో తెలియదు. ఎప్పుడైతే కథలో కీలక పాత్రలో ఒక స్టార్ హీరో గెస్ట్ గా కావాలని చిరంజీవి తో కొరటాల శివ అన్నాడో ఆ సమయంలో చరణ్ ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యిందట.
మొదట పది రోజుల కాల్షీట్లను మహేష్ బాబును అడిగి ఆచార్య లో నటింపజేయాలని భావించారు. సినిమాలో అది మంచి పాత్ర ఎక్కువ నిడివి ఉంటే ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేశారు. అందుకే చిరంజీవి ఇంత కంటే మంచి కథ తమ ఇద్దరి కోసం వస్తుందో రాదో తెలియదు అందుకే చరణ్ తో ఈ సినిమా లో కలిసి నటించడం వల్ల అందరి కోరిక తీరుతుందని.. తర్వాత తర్వాత ఆ అవకాశం వచ్చినా రాకున్నా పర్వాలేదు అనుకుని చిరంజీవి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు.
చిరంజీవి మరియు చరణ్ లు ఈ సినిమాలో తండ్రి కొడుకులు గా కాకుండా గురు శిష్యులుగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరి కాంబో సన్నివేశాలు కొద్ది సమయం మాత్రమే కాకుండా కాస్త ఎక్కువ సమయం ఉంటాయని అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నిర్మాణంలో కూడా చరణ్ భాగస్వామిగా ఉన్నాడు. ఒక వైపు నిర్మాత అవ్వడంతో పాటు మరో వైపు సినిమాలో కీలక పాత్రను కూడా చరణ్ చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆచార్య సినిమా ఒక ఆల్బం మాదిరిగా మెగా అభిమానులకు నిలిచి పోతుంది. సురేఖ గారికి కూడా ఆచార్య సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. ఈ తండ్రి కొడుకులు కూడా ఆచార్యను ప్రత్యేకంగా భావిస్తారని మెగా కాంపౌండ్ టాక్.
Recent Random Post: