తమిళ రాజకీయాల్లోకి రజినీ రాబోతున్నాడు అంటూ దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ప్రచారం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడంటూ అంతా నమ్మకంగా చెప్పుకున్నారు. కాని ఆయన మాత్రం తీవ్ర నిరాశ పర్చాడు. కనీసం ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించకుండానే రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించాడు. అనారోగ్యం కారణంగా రాజకీయం మొదలు పెట్టలేదు. అయితే ఇటీవల ఆయన అమెరికా వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తున్నాయి.
నేడు అభిమానులతో మీటింగ్ ను నిర్వహించిన రజినీకాంత్ మరోసారి రాజకీయాల్లోకి రావడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మక్కల్ మండ్రం ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. కేవలం సేవా కార్యక్రమాల కోసం అభిమాన సంక్షేమ మండ్రంను నిర్వహించబోతున్నట్లుగా పేర్కొన్నాడు. అభిమానుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ ను కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు.
Recent Random Post: