‘విరాటపర్వం’ డైరెక్టర్ పట్టుదల

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రియమణి కీలక పాత్రలో నటించిన విరాటపర్వం సినిమా షూటింగ్ వారం రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉంది. విరాట పర్వం సినిమా షూటింగ్ అతి త్వరలోనే పూర్తి చేసి ప్రముఖ ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతున్న సినిమాల విడుదల విషయంలో మేము నిర్ణయం తీసుకోలేమని..

ఆ సినిమాల నిర్మాతల నిర్ణయంతో ఏకీభవించడం తప్ప మేము విడుదల అడ్డుకోలేమని ప్రకటన చేసి మరిన్ని సినిమాలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అనధికారికంగా కొన్ని సినిమాల డైరెక్ట్ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీ వర్గాల్లో విరాటపర్వం ఓటీటీ ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం మొదలు అయ్యింది. ఆ వార్తలపై దర్శకుడు వేణు ఉడుగుల స్పందించాడు.

విరాటపర్వం చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల గతంలోనే తమ సినిమాను థియేటర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని అన్నాడు. తాజాగా మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఆయన మళ్లీ స్పందించాడు. తమ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని భావించడం లేదని.. సినిమా ను ఖచ్చితంగా థియేటర్ ల్లో విడుదల చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

ఈ సినిమా షూటింగ్ ముగియకుండానే ప్రముఖ ఓటీటీ భారీ ఆఫర్ ను ఇచ్చిందట. నిర్మాత ఆ ఆఫర్ విషయంలో ఆలోచిస్తున్నాడని.. రానా కూడా ఓటీటీ విడుదల విషయంలో వ్యతిరేకంగా లేకపోవడం వల్ల త్వరలోనే విరాటపర్వం ఓటీటీ విడుదల అవ్వడం ఖాయం అంటూ అంతా అనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో వేణు ఉడుగుల ప్రకటన తో థియేటర్ల లో మాత్రమే విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. విరాట పర్వం సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి వెంటనే థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అయిన సమయంలో విడుదల చేస్తామని ఆయన పట్టుదలతో ఉన్నాడు. డైరెక్టర్ ఓటీటీ ద్వారా కంటే థియేటర్ల ద్వారా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటి వరకు నిర్మాతలను ఒప్పిస్తూ వచ్చిన ఆయన సినిమా ను మరి కొన్ని రోజుల పాటు పట్టుదలతో ఓటీటీకి ఇవ్వకుండా కాపాడగలిగితే థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

దర్శకుడు చాలా పట్టుదలతో ఉండటం వల్ల నిర్మాతలు కూడా ప్రస్తుతం విరాట పర్వం విడుదల విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదట. అయితే వెంటనే థర్డ్ వేవ్ వస్తే మాత్రం విరాటపర్వం సినిమా ఓటీటీ విడుదల తప్పక పోవచ్చు అంటున్నారు. నిర్మాతల శ్రేయస్సు కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా లను ఓటీటీలో విడుదల చేయక తప్పడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు వేణు ఉడుగుల కూడా మరింత ఆలస్యం అయితే అప్పుడు ఓటీటీకి ఓకే చెప్తాడేమో చూడాలి. విరాట పర్వం సినిమా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన విషయం తెల్సిందే. సాయి పల్లవి లుక్ మరియు ఆమె పాత్ర ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.


Recent Random Post: