ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కరోనా కారణంగా ఈ చిత్రానికి బోలెడన్ని బ్రేక్స్ వచ్చాయి ఇప్పటికే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో పుష్ప షూటింగ్ కు చాలానే అంతరాలు వచ్చాయి. తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసాక దాదాపు అన్ని చిత్రాల షూటింగ్స్ ను తిరిగి ప్రారంభించారు. అదే కోవలో హైదరాబాద్ లో పుష్ప షూటింగ్ కూడా సాగింది.
కానీ ఇప్పుడు పుష్ప షూటింగ్ కు బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది. దానికి కారణం దర్శకుడు సుకుమార్. తనకు వైరల్ ఫీవర్ సోకడంతో పుష్ప షూటింగ్ ఆగిపోయింది. దీంతో కొన్ని రోజులు చిత్ర షూటింగ్ సాగదు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ లెవెల్లో రెండు భాగాలుగా విడుదల చేస్తోంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Recent Random Post: