మా అధ్యక్షుడిగా బాలకృష్ణ అయితే నాకు ఓకే: మంచు విష్ణు

మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఈసారి బాలకృష్ణ మా అధ్యక్షుడైతే తాను సంతోషిస్తానని.. ఆయన వల్ల అందరికీ న్యాయం జరుగుతుంద’ని వ్యాఖ్యానించారు. తెలుగు సినీ పరిశ్రమలోని పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తాను బరి నుంచి తప్పుకుంటానని.. అది బాలకృష్ణ అయితే మరీ సంతోషమని అన్నారు. బాలకృష్ణ తనకు సోదరుడిలాంటి వ్యక్తి అని అన్నారు.

ఆయన జనరేషన్ వ్యక్తులు ఎవరు నిలబడినా తనకు ఓకే అని.. కాకపోతే వారికున్న బిజీ షెడ్యూల్స్ మా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించగలరని తాను అనుకోవడంలేదని అన్నారు. ఇక నాగబాబు చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. ‘నాగబాబు నాకు తండ్రిలాంటి వ్యక్తి. మా భవనం గురించి నా ప్లానింగ్ సమయం వచ్చినప్పుడు చెప్తాను. తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. వారితో మాట్లాడి ‘మా’కు స్థలం సంపాదించగలననే నమ్మకం ఉంది’ అని అన్నారు.


Recent Random Post: