బర్త్ డే స్పెషల్: ‘సూర్య’.. మాస్, క్లాస్ కలగలిపిన విలక్షణ నటుడు

దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. తమిళ స్టార్ హీరోగానే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు. సినీ వారసత్వం ఉన్నా నటనలో మేటి అనిపించుకుని తండ్రిని మించిన తనయుడిగా తమిళ స్టార్ హీరోగా ఎదిగారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే కాదు.. పవర్ ఫుల్ పాత్రల్లో కూడా సూర్య తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. కెరీర్లో సూర్య ఎదిగిన తీరు పరిశీలిస్తే..

మొదట్లో సాధారణ హీరోగా కెరీర్ మొదలుపెట్టి నటనా ప్రాధాన్య పాత్రలు చేసి అనంతర కాలంలో స్టార్ హీరోగా మారిపోయాడు. స్టైలిష్ పాత్రలు చేస్తూ ప్రేక్షకాదరణ దక్కించుకోవడమే కాకుండా.. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. దీంతో తన నుంచి కొత్త సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగేలా చేసుకున్నాడు. తండ్రి శివకుమార్ తమిళ సినిమాల్లో సీనియర్ స్టార్ హీరోనే అయినా.. ఆయన ప్రభావం లేకుండా అంతకుమించి స్టార్ హీరోగా ఎదిగాడు. సూర్యలో తోటి ఆర్టిస్టులకు ఇచ్చే గౌరవం కూడా ప్రత్యేకంగా ఉండటం కూడా ఆయన్ను ప్రత్యేకంగా నిలిపింది.

సూర్య కెరీర్ ను 2005కు ముందు.. ఆతర్వాతగా చెప్పుకోవాలి. కారణం.. ఆ ఏడాది విడుదలైన ‘గజిని’ సూర్యను స్టార్ హీరోగా మార్చేసింది. తమిళ్ లోనే కాదు.. తెలుగులో కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో సూర్య నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందే. ఈ సినిమాకు మరో కోణంలో సూర్యకు సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమాగా ‘సింగం’ సిరీస్ సినిమాలను చెప్పుకోవచ్చు. కథ కంటే సినిమాలో సూర్య నటన మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సూర్య ఫ్యాన్ బేస్ మరింత పెరిగిందనే చెప్పాలి.

మాస్, క్లాస్ అనే తేడా లేకుండా నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడం.. కొత్తదనం ఉన్న కథలను చేయడం సూర్య ప్రత్యేకత. శివపుత్రుడు., గజిని, సింగం ఎంత హిట్లో అంతకుమించి ప్రజాదరణ చూరగొన్న సినిమా సూరారై పొట్రు (తెలుగులో.. ఆకాశమే నీ హద్దురా). ఓటీటీలో రిలీజై అంచనాలు దాటి సంచలనాలు నమోదు చేసిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాదు.. గతేడాది ఓటీటీలో దేశంలోనే అత్యధిక వీక్షణలు దక్కించుకున్న రెండో సినిమాగా నిలిచింది. నటనతోపాటు సామాజిక సమస్యలపై కూడా సూర్య స్పందించడం గమనార్హం.

సమాజంలోని సమస్యలను పట్టించుకునే స్టార్ హీరోలు తక్కువే. వారిలో సూర్య ఒకరు. ‘అగరం ఫౌండేషన్’ ద్వారా పేద విద్యార్ధుల చదువుకు సాయం చేస్తూంటారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని కూడా ఆమధ్య డిమాండ్ చేశారు. సినిమా లైఫ్ లో రీల్ హీరోగా ఎంత స్టార్ డమ్ దక్కించుకున్నాడో.. రియల్ లైఫ్ లో కూడా సూర్య తన దాతృత్వం, సమస్యలపై స్పందించే గుణంతో తమిళ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. అందుకే తమిళ స్టార్ హీరోగానే కాకుండా.. దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. నేడు ఆయన 46వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తోంది


Recent Random Post: