అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి ప్రముఖ దర్శక రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటుగా తమిళం కన్నడ హిందీ చిత్రాలకు కూడా కథలు అందిస్తూ పాన్ ఇండియా రైటర్ అనిపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘బాహుబలి’ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్.. తనయుడితో కలిసి 100% సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం తండ్రి చెప్పే ఐడియాస్ లో కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడని స్టార్ రైటర్ చెబుతున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్.. తన కుమారుడు రాజమౌళి తాను చెప్పే స్టోరీ ఐడియాస్ లో కేవలం 10% మాత్రమే అంగీకరిస్తాడని వెల్లడించారు. దీనిని మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ పిలవబడే రాజమౌళి.. తన తండ్రి చెప్పే కథల విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటారని అర్థం అవుతోంది. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ రచించిన ‘బజ్రంగీ భాయ్ జాన్’ కథకి కూడా రాజమౌళి దర్శకత్వం వహించాల్సి ఉందట. ‘బాహుబలి’ సినిమాతో బిజీలో ఉండటంతో చేయడం కుదరలేదట. దీంతో ఆ కథ సల్మాన్ ఖాన్ దగ్గరకు వెళ్లడం.. కబీర్ ఖాన్ వచ్చి చేరడం.. 300 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. మరోవైపు జక్కన్న ‘బాహుబలి’ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
కాగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ”ఆర్ ఆర్ ఆర్” చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అలానే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కథ రెడీ చేస్తున్నారు. ఇది ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ మూవీ అని తెలుస్తోంది.
Recent Random Post: