నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాను సెకండ్ వేవ్ కు ముందు మే లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాని కరోనా సెకండ్ వేవ్ తో ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. ప్రస్తుతం చివరి దశ వర్క్ జరుపుకుంటున్న అఖండ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లు ఈమద్యే ప్రారంభం అయ్యాయి. ఈ నెలలో చిన్న చితక సినిమాలు చాలానే విడుదలకు సిద్దం అవుతున్నాయి. సెప్టెంబర్ లో కూడా సినిమాలు విడుదలకు ఉన్నాయి. అయితే అఖండ విడుదలకు సిద్దం అవ్వాలంటే మరో నెల నుండి నెలన్నర రోజులు పట్టనుందట. కనుక సినిమాను దసరా కు విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే దసరాకు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా విడుదల తేదీ విషయంలో జక్కన్న టీమ్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో పాటు వాయిదా అనేదే లేదు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. థర్డ్ వేవ్ వస్తే తప్ప ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆగడం దాదాపు అసాధ్యం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కనుక ఆర్ ఆర్ ఆర్ వస్తున్న దసరా సీజన్ లో రావడానికి ఏ హీరోలు ఆసక్తి చూపడం లేదు. సంక్రాంతిపై చాలా మంది హీరోలు ఫోకస్ పెట్టారు. బాలయ్య కూడా డిసెంబర్ లేదా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకే సినిమాను బాలయ్య విడుదల చేయాలని ఆశ పడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమాను అక్టోబర్ 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. 99 శాతం సినిమా విడుదల కన్ఫర్మ్ అంటున్నారు. కనుక ఆ సమయంలో మరే సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవ్వడం లేదు. కాని బాలయ్య మాత్రం తన అఖండ సినిమాను ఆర్ ఆర్ ఆర్ సినిమాకు వారం ముందు లేదా వారం తర్వాత అయినా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ కు విడుదల చేస్తేనే ఎక్కువ బజ్ ఉంటుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలా అఖండ సినిమాను దసరాకు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న బాలయ్య ఆ తర్వాత తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా వల్ల తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.
దసరాకు కాకుండా దీపావళికి ఈ సినిమాను విడుదల చేయవచ్చు కదా అంటూ కొందరు సూచిస్తున్నారు. కాని అఖండ మేకర్స్ దృష్టిలో ఏముంది అనేది చూడాలి. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు పోటీ ఉండకూడదు అంటూ పెద్ద హీరోలు కూడా భావిస్తున్నారు. అప్పట్లో బాహుబలి సినిమా కోసం మహేష్ బాబు సినిమాను వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం అఖండ సినిమాను కాస్త ఆలస్యంగా విడుద లచేసుకునేలా బాలయ్య ను మేకర్స్ ఒప్పిస్తారనేమో చూడాలి. అయినా ఆర్ ఆర్ ఆర్ సినిమా కు వారం ముందు అఖండ వస్తే సినిమా సూపర్ హిట్ అయినా కూడా వసూళ్లు వారంకే పరిమితం అవుతాయి.
ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత వారం కు వచ్చినా కూడా అఖండ సినిమా గురించి జనాలు పట్టించుకోకుండా జక్కన్న సినిమా కోసమే వెళ్తారు. కనీసం రెండు వారాల పాటు జక్కన్న మూవీ సందడి ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా కూడా రెండు వారాలు బాక్సాఫీస్ మొత్తం కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కనుక అఖండతో అంతటి సాహసంను బాలయ్య చేస్తాడా అంటే చేయక పోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం.
Recent Random Post: