‘నేను చనిపోలేదు.. సోషల్ మీడియా వార్తలు నమ్మొద్దు..’: ఊర్వశి శారద

అలనాటి మేటి, దిగ్గజ నటి.. ఊర్వశి శారద కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. ఆదివారం ఉదయం ఈ వార్త హల్‌చల్‌ చేయడంతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. ఆ వార్తపై స్పష్టత కోసం పరిశ్రమలోని నటీనటులు, అభిమానులు వేచి చూశారు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త నిరాధారమైనదని తేలింది. దీనిపై నటి శారద స్పష్టతనిచ్చారు.

‘నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. కొద్దిగా ఒంట్లో నలతగా ఉంది. ఒక వ్యక్తి చేసిన పని ఇదంతా. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ వార్తలు నమ్మొద్దు. వాస్తవ సమాచారం లేకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం. దయచేసి సోషల్ మీడయాలో వచ్చే ఇటువంటి వార్తలను నమ్మకండి’ అని తెలిపారు.

దక్షిణాది భాషా చిత్రాల్లో కథానాయిక, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శారద నటించారు. మూడుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 76 సంవత్సరాలు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా చెన్నైలో ఉంటున్నారు.


Recent Random Post: