సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో ఇండియన్ అథ్లెట్స్ పథకంను దక్కించుకోలేక పోయారు. ఇండియా బంగారం పట్టి చాలా చాలా ఏళ్లు అయ్యింది. ఒక్క గోల్డ్ మెడల్ కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా నీరజ్ చోప్రా ఆ కలను సాకారం చేశాడు. టోక్యో ఒలింపిక్స్ లో బంగారం ముద్దాడిన నీరజ్ చోప్రా మొత్తం 140 కోట్ల మంది భారతీయులకు హీరో అయ్యాడు. అద్బుతమైన విజయంతో నీరజ్ చోప్రా దక్కించుకున్న ఖ్యాతితో ఆయన గురించి తెలుసుకోవాలి అంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాంటి నీరజ్ చోప్రా బయోపిక్ ను తెరకెక్కించేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఇటీవల నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా నందన్ తో నేషనల్ హీరో నీరజ్ చోప్రా బయోపిక్ ను చేయించాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయమై పవన్ కళ్యాణ్ ను ఇతర సినిమా డైరెక్టర్స్ ను ట్యాగ్ చేస్తూ అభిమానులు ట్వీట్ లు చేస్తున్నారు. అకీరా ఫిజిక్ మరియు హైట్ ఇలా ప్రతి విషయంలో కూడా నీరజ్ చోప్రా బయోపిక్ కు నూటికి నూరు శాతం సరిగ్గా సూట్ అవుతాడు అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. పవన్ అభిమానులు చాలా కాలంగానే అకీరా నందన్ ను హీరోగా చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు నీరజ్ చోప్రా బయోపిక్ తో వస్తే చూడాలని ఆశ పడుతున్నారు.
హీరో అయ్యేంత వయసు అకీరా నందన్ కు రాలేదు. అతడు హీరోగా చేయాలంటే కనీసం నాలుగు అయిదు సంవత్సరాలు అయినా సమయం కావాల్సిందే. కాని అప్పటికి అయినా అతడు హీరోగా నటించేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాడా లేదా అనేది తెలియదు. ప్రస్తుతం మాత్రం మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకుంటున్న అకీరా నందన్ త్వరలోనే విదేశాలకు వెళ్లి చదువుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ను నేర్చుకుంటాడని అంటున్నారు. తల్లి రేణు దేశాయ్ హీరోయిన్.. తండ్రి పవన్ స్టార్ హీరో.. పెద నాన్న మెగాస్టార్ కుటుంబంలో అంత మంది స్టార్స్ ఉన్నప్పుడు అకీరా ఎందుకు సినిమా చేయకూడదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కనుక ఖచ్చితంగా అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని.. అది కూడా నేషనల్ హీరో నీరజ్ చోప్రా బయోపిక్ అయితే బాగుంటుంది అనేది చాలా మంది కామెంట్స్. మరి పవన్ సారు ఏం ఆలోచన చేస్తాడో చూడాలి.
Recent Random Post: