నాని, సమంత, విజయ్ దేవరకొండ, చైతన్యలు నాకు సపోర్ట్ చేస్తున్నారు: సుహాస్

షార్ట్ ఫిలిమ్స్ నుండి కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుహాస్ ఇప్పుడు సినిమా హీరోగా బిజీ అయ్యాడు. ముఖ్యంగా కలర్ ఫోటో చిత్రం సూపర్ సక్సెస్ సాధించి సుహాస్ కు బ్రేక్ ఇచ్చింది. ఈ హీరో ఇప్పుడు ఆరు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఈ ఆరింటిలో ఐదు సినిమాలో తాను హీరోగా నటిస్తున్నానని, మరో సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లు వివరించాడు.

తనకు సినిమాల్లో సపోర్ట్ బాగుందని, నాని, నాగ చైతన్య, సమంత, బ్రహ్మాజీ, శివ నిర్వాణ తదితరులు తనకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారని తెలిపాడు. ఇక సుహాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రైటర్ పద్మనాభం. ఈ చిత్రం షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయినట్లు తెలిపాడు.

విజయవాడలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏం జరిగింది అన్నది రైటర్ పద్మనాభం యొక్క మెయిన్ పాయింట్ తెలిపాడు.


Recent Random Post: