సినిమాల నుంచి నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా: నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీశ్’ సెప్టెంబరు 10న ఓటీటీలో విడుదల అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘పరిస్థితులు బాగోనప్పుడు కాదు పరిస్థితులు బాగుండి, నా చిత్రాల్ని థియేటర్లలో కాకుండా ఓటీటీకి ఇచ్చినప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు.. నటుడిగా నన్ను నేనే బ్యాన్‌ చేసుకుంటా’ అని నటుడు నాని తెలిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘భావోద్వేగాల్ని శివ నిర్వాణ బాగా తెరకెక్కిస్తాడు. మేమిద్దరం కలిసి చేసిన ‘నిన్నుకోరి’, తన గత చిత్రం ‘మజిలీ’కి మించిన ఎమోషన్‌ ‘టక్‌ జగదీష్‌’లో ఉంటుంది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నామని కొందరు ఆరోపించారు. వారిపై నాకు గౌరవం ఉంది. వాళ్లున్న పరిస్థితుల్లో అలా స్పందించడం తప్పేం కాదు. నాని వాళ్ల కుటుంబసభ్యుడే. నేనూ వాళ్లలో ఒకడినే. ఆ కాసేపు బయటివాడ్ని చేశారనే బాధ ఉంది’ అంటూ పై వ్యాఖ్యలు చేశారు.


Recent Random Post: