సోదరుడు సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఎన్టీఆర్ ట్వీట్..!


మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని హెల్త్ బులిటెన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని సినీ ప్రముఖులు అభిమానులు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించారు.

”సోదరుడు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని తారక్ ట్వీట్ చేస్తూ హార్ట్ సింబల్ ఎమోజీని జోడించారు. అలానే సాయి తేజ్ స్నేహితుడు హీరో మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశారు. ”మిత్రమా నువ్వు ప్రమాదం నుండి బయటపడినందుకు మేమందరం సంతోషిస్తున్నాము. త్వరగా కోలుకో మిత్రమా.. లవ్ యూ” అని మనోజ్ పేర్కొన్నారు.

ఇదే క్రమంలో రవితేజ – సుధీర్ బాబు – విజయ్ దేవరకొండ – అనిల్ రావిపూడి – మెహర్ రమేష్ – బాబీ – గోపీచంద్ మలినేని – నిధి అగర్వాల్ – సుధీర్ బాబు – కార్తికేయ – దేవిశ్రీప్రసాద్ – థమన్ – వరుణ్ తేజ్ – రాహుల్ రామకృష్ణ – శ్రద్ధాదాస్ – శ్రీకాంత్ – నిఖిల్ – బెల్లంకొండ శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ తదితరులు సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెట్టారు. ప్రకాష్ రాజ్ – శ్రీకాంత్ ఆసుపత్రికి వెళ్లి తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

అలానే రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయి తేజ్ ను చిరంజీవి పరామర్శించారు. శనివారం ఉదయం తన సతీమణి సురేఖతో కలిసి చిరు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా హాస్పిటల్ కు వచ్చారు. సాయితేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


Recent Random Post: