తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన హరితేజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత హరితేజ చాలా విషయాల్లో సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వస్తుంది. తాజాగా ఈసారి బిగ్ బాస్ ఎలా ఉంది.. ఎవరికి తన మద్దతు అనే విషయాల గురించి కూడా మాట్లాడింది. బిగ్ బాస్ సీజన్ 5 లో తన అభిమాన కంటెస్టెంట్ ఆర్ జే కాజల్ అంది. ఆమె టాప్ 5 లో ఉండాలని తాను ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.
ఆర్ జే కాజల్ చాలా విషయాల్లో మంచి పైటర్ గా నిలుస్తుందని.. ఆమె కు ఖచ్చితంగా ఫైనల్ 5 కి వెళ్లే అర్హత ఉందని హరితేజ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆమె గురించి హరితేజ చేసిన వ్యాఖ్యలతో కాజల్ కు మరింత బలం పెరిగినట్లయ్యింది. మొదటి రెండు వారాల్లో చాలా నెగిటివిటీని కూడగట్టుకున్న కాజల్ ఈమద్య మెల్ల మెల్లగా అందరికి సన్నిహితం అవుతోంది. ఇప్పుడు కాజల్ అందరితో బాగానే ఉంటున్న కారణంగా ప్రేక్షకులు కూడా ఆమెను టార్గెట్ చేయడం లేదు.
Recent Random Post: