హీరో రామ్ కు గాయం… షూటింగ్ కు అంతరాయం?

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ప్రస్తుతం దీనికి బ్రేకులు పడ్డాయి. రామ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా మెడకు గాయమైంది. స్వయంగా ఈ విషయాన్ని రామ్ తెలియజేసాడు. మెడకు పట్టీతో రామ్ కనిపించాడు.

దీంతో రామ్ చేస్తోన్న చిత్ర షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. లింగుసామి డైరెక్ట్ చేస్తోన్న ఈ బైలింగ్వల్ లో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

త్వరలోనే రామ్ కోలుకోవాలని, మరింత ఎనర్జీతో తిరిగి సినిమాలు చేయాలని రామ్ ఫ్యాన్స్, నెటిజన్లు కోరుకుంటున్నారు. ఆది ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తుండగా అక్షర గౌడ కూడా నటిస్తోంది. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


Recent Random Post: