పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రాపై హీరోయిన్ షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే.. తమ నుంచి డబ్బు తీసుకుని పలువురు రాజ్ కుంద్రాతోపాటు శిల్పాశెట్టి కూడా మోసం చేశారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షెర్లిన్ చోప్రాపై కూడా.. తనను మానసికంగా వేధించారని ఆరోపిస్తోంది. కుంద్రాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని షెర్లిన్ పోలీసులను ఆశ్రయించింది.
తనపై లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరినట్లు మీడియాతో పేర్కొంది. రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ డాన్‌తో సంబంధం ఉందని.. వీళ్లంతా కలిసి తనను బెదిరించారనే ఆరోపణలు కూడా చేసింది. తాను పెట్టిన పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 19న రాజ్ బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించి కేసును వెనక్కు తీసుకోవాలని హెచ్చరించాడని ఆరోపించింది. ప్రస్తుతం ఈ అంశం సంచలనం రేపుతోంది.
Recent Random Post: