అభిమానులు అందరి హీరోలకూ ఉంటారు. అయితే మెగా హీరోల విషయంలో వేరు. వారు కేవలం అభిమానంతో ఆగరు మెగా ఫ్యామిలీలో మెంబర్స్ గా మారిపోతారు. పైగా మెగాస్టార్ సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కాబట్టి వారు అందులో భాగస్వాములు అవుతారు. తాజాగా విశేషమెంటి అంటే చాలా కాలం తరువాత మెగాభిమానులతో మెగాస్టార్ చిరంజీవి సమావేశం కావడం. దానికి తెలంగాణా ఆంధ్రా కర్నాటకల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా కరోనా కష్టంలో తనతో పాటు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న అభిమానులకు చిరంజీవి ధన్యవాదాలు చెప్పారు. మీ అభిమానం కలకాలం ఇలాగే ఉండాలని కూడా గట్టిగా కోరుకున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే తొందరలోనే ఆంధ్రావ్యాప్తంగా ఉన్న మెగాభిమానులతో ఒక భారీ సమావేశాన్ని మెగాస్టార్ పెడతారని చెబుతున్నారు. నిజంగా ఇది మాత్రం ఆసక్తిని కలిగించే అంశంగానే చూడాలి. ఎండుకంటే 2008 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత మెగాస్టార్ అభిమానులతో ఇంతలా కనెక్ట్ అయిందిలేదు. చాన్నాళ్ల తరువాత ఆయన వారితో వరస సమావేశాలూ అంటూంటే సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక విధమైన ఉత్కంఠ కనిపిస్తోంది. తాజాగా మూడు రాష్ట్రాల అభిమానులతో మీటింగ్ పెట్టిన మెగాస్టార్ ప్రత్యేకించి ఏపీలోని చిరంజీవి అభిమానులతో మీటింగ్ అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.
ఈ మధ్య ఏపీ రాజకీయాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ గట్టిగానే పోరాడుతోంది. ఇక సినీ నటుడు మెగా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన ఎటూ ఉండనే ఉంది. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి అభిమానులతో వరస సమావేశాలు అంటే పొలిటికల్ గా చూస్తే కలకలం రేపేవే అంటున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా ఒక అటెంప్ట్ చేశారు. అది ఫెయిల్ అయింది. అయితే ఉమ్మడి ఏపీలో చేసిన ప్రయోగం విఫలమైనా కేవలం ఏపీలో కనుక గట్టిగా నిలబడితే ప్రజరాజ్యం అధికారంలోకి వచ్చేది అన్న మాట కూడా అప్పట్లో వినిపించింది.
ఇక 2024 ఎన్నికలలో జనసేన తన సత్తా చాటాలని చూస్తోంది. మరి చిరంజీవి కూడా తమ్ముడికి మద్దతుగా ఉంటారా లేక తాను కూడా రాజకీయంగా తేల్చుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. తనకు రాజకీయాల మీద ఎటువంటి ఆసక్తి లేదు అని ఆ మధ్యన చిరంజీవి ప్రకటించినప్పటికీ రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పైగా సినిమా రంగంలోకి రాజకీయాలు వచ్చేశాయి. మా ఎన్నికల్లో అది రుజువు అయింది. దాంతో చిరంజీవి కూడా మనసు మార్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ఇక మెగాస్టార్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఆయన తన ఇమేజ్ ని స్టామినాను మరోమారు రాజకీయ తెర మీద చూపించాలనుకుంటే మాత్రం 2024 ఎన్నికల కంటే మించిన అవకాశం కూడా వేరేదీ ఉండబోదని కూడా అంటున్నారు. చూడాలి మరి మెగా మీటింగుల సారాంశం ఏంటో. అవి సేవా కార్యక్రమాల దగ్గరే ఆగుతాయా లేక సంచలన నిర్ణయాల వైపుగా సాగుతాయా అన్నది చూడాలి.
Recent Random Post: