విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ అమ్మడు ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే బాలీవుడ్ లో ఈమె రెండు సినిమాలకు కమిట్ అయ్యింది. అక్కడ రెండు సినిమాలు కూడా భారీ ఎత్తున తెరకెక్కబోతున్నాయి. ఆ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
సమంత హీరోయిన్ గా తెలుగు లో కూడా ఒకటి రెండు ఆఫర్లు వస్తున్నాయి. కాని శాకుంతలం తర్వాత ఇప్పటి వరకు ఆమె సినిమాలు ఏమీ కూడా చేయలేదు. తమిళంలో మాత్రం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది. తెలుగు లో మరియు తమిళంలో సినిమాలతో పోల్చితే ఆమె బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సమంత స్టార్ గా అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుంది. అందుకే వరుసగా అక్కడ సినిమాలు చేసేందుకు సిద్దం అవుతోంది.. అందుకు తగ్గట్లుగానే ఈమెకు ఆఫర్లు కూడా వస్తున్నాయి.
Recent Random Post: