అనుపమ ఏజ్ గురించి రౌడీ స్టార్‌ కొంటె కామెంట్స్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశీష్‌ నటించిన రౌడీ బాయ్స్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఈ సినిమాలో ఆశీష్‌ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించిన విషయం తెల్సిందే. ఆమె చాలా ఏళ్ల నుండి నటిస్తుంది. మలయాళ ప్రేమమ్‌ సినిమాలో ఆమె పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమాలో అనుపమ నటించినప్పుడు నేను చిన్న పిల్లాడిని అంటూ విజయ్ దేవరకొండ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

అనుపమ ఇప్పుడు మహిళగా మారింది అంటూ కూడా విజయ్ దేవరకొండ అన్నాడు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆమె అలాగే ఉంది కాని ఆమె వయసు మాత్రం పెరిగింది అన్నట్లుగా రౌడీ స్టార్ కామెంట్స్ చేశాడు. పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. కొత్త హీరో అయిన ఆశీష్‌ కు జోడీగా ఆమెను ఎందుకు నటింపజేశారు అనేది కొందరి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.


Recent Random Post: