బిగ్ బాస్ సీజన్ 5: ఎమోషనల్ గా సాగిన నామినేషన్ ప్రక్రియ!

బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రతీసారి నామినేషన్స్ అంటే జరిగే రచ్చ మాములుగా ఉండదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అరుచుకోవడంతో బిగ్ బాస్ హీట్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈసారి నామినేషన్స్ ప్రక్రియను వినూత్నంగా నిర్వహించాడు బిగ్ బాస్. హౌజ్ మేట్స్ అందరికీ ఇంటి నుండి లెటర్స్ వచ్చాయని చెప్పిన బిగ్ బాస్, అవి చదవాలి అంటే మాత్రం కచ్చితంగా త్యాగం చేయాల్సి ఉంటుందని తెలిపాడు.

బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్ ప్రకారం ప్రతీసారి ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తుంటాడు. అలా వచ్చినప్పుడు ఉత్తరాలు వస్తాయి. పోస్ట్ మ్యాన్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ పిలిచిన దాని ప్రకారం ఇద్దరు ఇంటిసభ్యులు పవర్ రూమ్ కు వెళ్లాల్సి ఉంటుంది. వారి చేతికి మరో ఇద్దరు ఇంటి సభ్యులకు సంబంధించిన ఉత్తరాలు ఇస్తారు. వీరిలో ఒకరి ఉత్తరం శ్రద్దర్ లో వేయాల్సి ఉంటుంది. అంటే వారి లెటర్ ముక్కలుగా చిరిగిపోతుంది. దాంతో పాటు లెటర్ అందుకోని ఇంటి సభ్యుడు డైరెక్ట్ గా నామినేట్ అవుతాడు. లెటర్ అందుకున్న వారు సేఫ్ అవుతారు.

ఈ ప్రాసెస్ లో భాగంగా ముందుగా మానస్, శ్రీరామ్ లను పిలిచారు. వారికి ప్రియాంక, లోబోలకు సంబంధించిన లెటర్స్ వచ్చాయి. ఇందులో లోబో త్యాగం చేసి ప్రియాంకకు లెటర్ వచ్చేలా చేసాడు. లోబో లెటర్ శ్రద్దర్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత విశ్వ, సిరిల లెటర్స్ షణ్ముఖ్, రవి లకు వచ్చాయి. విశ్వ తన కొడుకు విషయంలో ఎమోషనల్ అవ్వడంతో సిరి త్యాగం చేసింది. ఆ తర్వాత ఎన్నీ మాస్టర్, మానస్ ల లెటర్స్ కాజల్, ప్రియాంకలకు వచ్చాయి.

మానస్ త్యాగం కారణంగా ఎన్నీ మాస్టర్ కు లెటర్ వచ్చింది. ఆ తర్వాత రవి, శ్రీరామ్ లకు లింక్ పడింది. ఇద్దరూ కూడా పర్లేదు మా లెటర్స్ చింపేయండి అంటూ త్యాగం చేయబోయారు. అయితే లోబో వచ్చి రవితో నీ దగ్గర నీ ఫ్యామిలీకు సంబంధించి ఏదో ఒకటి ఉంది కానీ శ్రీరామ్ కు ఏం లేదు కదా అని చెప్పడంతో రవి లెటర్ ను చించేశారు. ఫైనల్ గా షణ్ముఖ్, కాజల్ లలో షణ్ముఖ్ తన లెటర్ ను త్యాగం చేసాడు.

ఇక మిగిలి ఉన్నది జెస్సీ. తన లెటర్ ఇవ్వాలంటే హౌజ్ లో కెప్టెన్ గా ఉన్న సన్నీ ఎవరో ఒకరి లెటర్ ను చించేయాల్సి ఉంటుంది. ఆ ఇంటి సభ్యుడ్ని జెస్సీ స్థానంలో నామినేట్ చేయాల్సి ఉంటుంది. లేదా జెస్సీ లెటర్ ను శ్రద్దర్ లో వేసి డైరెక్ట్ గా జెస్సీను నామినేట్ చేయొచ్చు. ఇక్కడ శ్రీరామ్ చంద్ర తన లెటర్ ను చించడానికి ఒప్పుకుని జెస్సీను సేవ్ చేసాడు. సో, జెస్సీకు కూడా లెటర్ వచ్చింది. కెప్టెన్ అయిన సన్నీకు ఎటువంటి షరతులు లేకుండా లెటర్ ఇచ్చారు. మొత్తానికి ఈసారి నామినేషన్స్ లో లోబో, సిరి, మానస్, శ్రీరామ్, రవి, షణ్ముఖ్ ఉన్నారు.


Recent Random Post: