7 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్న నాగ శౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య గత రెండు సినిమాలు కొంత నిరాశపరిచిన విషయం తెల్సిందే. అయితే తర్వాత ప్రామిసింగ్ సినిమాలతో శౌర్య బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకు డీసెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ సినిమా సేఫ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇక నాగ శౌర్య నటించిన లక్ష్య కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇందులో శౌర్య ఆర్చర్ పాత్రలో కనిపిస్తాడు. అలాగే శ్రీనివాస్ అవసరాలతో కలిసి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాను కూడా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నాగ శౌర్య 7 భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. అయితే అవేమిటి అనే క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.


Recent Random Post: