తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్లుగా పేరు సంపాదించుకున్న టాప్ స్టార్స్ తారక్, చరణ్ కలిసి నటిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేయనున్న విషయం తెల్సిందే. చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ ఆర్ ఆర్ నుండి సెకండ్ సాంగ్ నాటు నాటు విడుదలైంది.
పేరుకి తగ్గట్లుగానే ఈ సాంగ్ ఊర నాటుగా ఉంది. మాస్ బీట్స్ కు తోడు, ఎన్టీఆర్, చరణ్ ల డ్యాన్స్ కూడా తోడై ఈ సాంగ్ ను చూడటానికి రెండు కళ్ళూ సరిపోవట్లేదు. వినగానే ఇన్స్టంట్ గా ఎక్కేసిన ఈ సాంగ్ లో ఇద్దరి టాప్ హీరోల డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ప్రేమ్ రక్షిత్ ఈ సాంగ్ ను కొరియోగ్రాఫ్ చేసాడు.
ఎంఎం కీరవాణి సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించాడు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ ఈ సాంగ్ ను పాడారు.
Recent Random Post: