‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. రెగ్యులర్ హీరో ఫార్మాట్ సినిమాలకు భిన్నంగా కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ప్రేక్షకులకు అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ”పుష్పక విమానం” అనే మరో కొత్తదనమున్న సినిమాతో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యాడు దేవరకొండ బ్రదర్.
దామోదర దర్శకత్వంలో రూపొందిన ‘పుష్పక విమానం’ చిత్రాన్ని రేపు (నవంబర్ 12) విడుదల కానుంది. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ సినిమాని గోవర్ధన్ రావు దేవరకొండ – విజయ్ మట్టపల్లి – ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలను ఆనంద్ మీడియాతో పంచుకున్నారు. ‘దొరసాని’ సినిమా ప్లాప్ అవడానికి గల కారణాలు.. తనకు వచ్చిన ట్రోల్స్ గురించి కూడా ప్రస్తావించాడు.
“విరాట్ కోహ్లీ వంటి లెజెండరీ బ్యాట్స్ మెన్ కు కూడా వరల్డ్ కప్ లో పేలవమైన ప్రదర్శనతో ట్రోల్ చేయబడతారు. అలాంటిది నేను ఎంత? నేను నెపోటిజం ప్రొడక్ట్ అని ప్రజలు భావిస్తారు. అది ఓకే” అని ఆనంద్ దేవరకొండ అన్నారు. ”రొటీన్ కి భిన్నంగా ముందుకు వెళ్లాలనేదే నా లక్ష్యం. హీరోయిజం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న కథలవైపే మొగ్గుచూపుతున్నా. నా తొలి సినిమా ‘దొరసాని’ సమయంలో అంత అవగాహన లేదు. దాన్ని ఒక ఆర్ట్ ఫిల్మ్ గా లేదా కమర్షియల్ సినిమాగా అయినా తీయాలి. మేము మిడిల్ మార్గాన్ని ఎంచుకున్నాం. సినిమా అనుకున్నంత విజయం అందుకోలేదు. అయినా ఓ మంచి ప్రయత్నం చేశాననుకుంటున్నా” అని చెప్పారు.
‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ పై ముందు నుంచే నమ్మకం ఉంది. అటువంటి చిత్రాలను చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అలాంటి సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు ముందుకు వస్తున్నారు. నటీనటులు మాత్రమే ముందుకు రావాలి. అదే నేను చేస్తున్నాను. ‘పుష్పక విమానం’ సినిమా వినోదం అందించడంతో పాటుగా థ్రిల్ కు గురి చేస్తుంది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని ఆనంద్ దేవరకొండ ధీమా వ్యక్తం చేశారు.
Recent Random Post: