మహేష్ ఈసారి నిర్మాతగా వెనక్కు తగ్గక తప్పదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు తన బ్యానర్ లో సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. అడవి శేషు హీరోగా మహేష్ బాబు బాలీవుడ్ సంస్థతో కలిసి మేజర్ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. గత రెండేళ్లుగా మేజర్ సినిమా గురించి చర్చ జరుగుతోంది. గత ఏడాదిలో సినిమా రావాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. ఈ ఏడాదిలో కూడా సినిమా విడుదల అయ్యేది లేదని తేలిపోయింది. ఇటీవలే ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 11న మేజర్ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మహేష్ బాబు టీమ్ ప్రకటించిన నేపథ్యంలో ఎట్టకేలకు సస్పెన్స్ కు తెర పడ్డట్లయ్యింది అనుకుంటున్న సమయంలో మళ్లీ చిక్కు ముడి పడ్డట్లయ్యింది.

ఆచార్య విడుదల అయిన వారం గ్యాప్ లోనే మేజర్ ను విడుదల చేసేందుకు తేదీని ప్రకటించారు. ఇప్పటికే ఆ తేదీ కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా మరీ ఆలస్యం చేయడం ఇష్టం లేని మేకర్స్ ఆచార్య విడుదల అయిన తర్వాత వారం రోజులకే విడుదల చేయాలని నిర్ణయించారు. ఇతర భాషల్లో కూడా విడుదల అవ్వాల్సి ఉంది కనుక అదే తేదీని అనుకున్నారు. ఈ సమయంలో రవితేజ ఖిలాడి సినిమాను కూడా అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఫుల్ మాస్ పవర్ ప్యాక్ మూవీగా రూపొందిన ఖిలాడి సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. సినిమా పోస్టర్స్ మరియు ఇతర ప్రమోషన్స్ స్టఫ్ చూస్తుంటే ఖచ్చితంగా మంచి మాస్ విజయాన్ని ఖిలాడి దక్కించుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు.

అలాంటి ఖిలాడి సినిమాతో మేజర్ పోటీ పడటం అది కూడా ఆచార్య విడుదల అయిన వారంకే వచ్చి మరో పెద్ద మాస్ సినిమాను పోటీ పడటం వల్ల నష్టం తప్పదని భావిస్తున్నారు. ఇతర భాషల్లో పరిస్థితి ఏంటో కాని తెలుగు లో మాత్రం ఖచ్చితంగా మంచి వసూళ్లను దక్కించుకోలేదు అనడంలో సందేహం లేదు. అందుకే మహేష్ బాబు మేజర్ ను వాయిదా వేసే విషయమై ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను ఆర్ ఆర్ ఆర్ కారణంగా సంక్రాంతి బరి నుండి తప్పించారనే విషయం తెల్సిందే. ఇప్పుడు మహేష్ బాబు నిర్మాతగా కూడా వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. నిర్మాతగా చాలా నమ్మకం పెట్టుకుని మహేష్ బాబు ఈ సినిమాను చేశాడు. ఖచ్చితంగా మంచి డేట్ లో విడుదల చేస్తే బాగుంటుందని అంటున్నారు. ముంబై ఉగ్ర దాడుల నేపథ్యంలో రూపొందిన మేజర్ సినిమాలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణణన్ పాత్రలో అడవి శేషు నటించాడు.


Recent Random Post: