న్యాచురల్ స్టార్ నాని గత రెండు సినిమాలు వి, టక్ జగదీష్ ఓటిటి బాట పట్టడంతో రచ్చ బాగానే జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు నాని సినిమాలను ప్రదర్శించం అనే వరకూ పరిస్థితి వెళ్ళింది. అయితే నాని ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకున్నాడు. తన తర్వాతి చిత్రం కచ్చితంగా థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించాడు. అన్నట్లుగానే శ్యామ్ సింగ రాయ్ ను అందరికంటే చాలా ముందు డిసెంబర్ 24కి కన్ఫర్మ్ చేసాడు.
ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలవుతోంది. రాహుల్ సంకిట్ర్యాన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. క్రిస్మస్ సెలవులను క్యాష్ చేసుకోవాలని భావించి ఆ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు.
సోలో రిలీజ్ దక్కితే ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉండేది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా గని అదే డేట్ కు రిలీజ్ ను అనౌన్స్ చేసారు.
Recent Random Post: