బిగ్ బాస్ 5: జెస్సీ వెళ్ళిపోతూ సన్నీ గ్రూప్ ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడా?

బిగ్ బాస్ సీజన్ 5 లో సన్ డే ఫన్ డే ముగిసింది. ప్రతీ ఆదివారం లాగానే ఈ రోజు కూడా నాగార్జున కొన్ని టాస్క్ లను ఆడించాడు. అందుకోసం రెండు టీమ్స్ గా విడదీసాడు. మానస్ ను సంచాలకుడిగా పెట్టి షణ్ముఖ్, సన్నీ, ప్రియాంక, ఎన్నీలను ఒక టీమ్ గా సెలెక్ట్ చేయగా శ్రీరామ్ చంద్ర, రవి, సిరి, కాజల్ లు మరో టీమ్ లోకి వచ్చారు.

ఇక మొదటి గేమ్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న డయాస్ మీద డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. మ్యూజిక్ ఆగాక, నాగార్జున ఫైర్, ఐస్, వాటర్ లలో ఒక జోన్ సెలెక్ట్ చేస్తే అందులోకి పరిగెత్తాలి. ఇందులో లాస్ట్ వచ్చిన వారు ఎలిమినేట్ అవుతారు. అలా ఎలిమినేట్ అయిన వారికి బాలల దినోత్సవం సందర్భంగా చిన్న చిన్న శిక్షలు వేస్తారు. ఈ టాస్క్ లో సన్నీ గెలిచాడు. ఇక నామినేషన్స్ లో ఉన్న నలుగురు నుండి సిరి సేఫ్ అయింది.

ఆ తర్వాత సినీ నటీనటులు చిన్నప్పటి ఫోటోలను గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ రౌండ్ లో కూడా సన్నీ టీమ్ విజయం సాధించింది. దాని తర్వాత నామినేషన్స్ లో ఉన్న ముగ్గురిలో నుండి రవి సేఫ్ అయ్యాడు. ఇక నామినేషన్స్ లో మానస్, కాజల్ లు నిలిచారు. మూడో ఆటగా కంటెస్టెంట్స్ మెడలో సెల్ఫిష్, పొగరుబోతు, ఫేక్ ఇలాంటి బోర్డ్స్ ను సెలెక్ట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ను కంటెస్టెంట్స్ అందరూ కొంత ఎంటర్టైనింగ్ గానే తీసుకున్నారు. మానస్, కాజల్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని చిన్న సస్పెన్స్ పెట్టిన నాగార్జున చివరికి జెస్సీ ఎలిమినేట్ అవుతున్నట్లు తెలిపాడు. తను వెళ్ళిపోతూ మీలో ఒకరిని సేవ్ చేస్తున్నాడు జెస్సీ అని నాగార్జున అన్నాడు.

తనకున్న వెర్టిగో సమస్య పూర్తిగా తగ్గకపోవడంతో జెస్సీ ఇంటికి వెళ్లకతప్పడం లేదు. ఇక వెళ్తూ ఫోన్ లో పర్సనల్ గా ఒక్కో వ్యక్తితో మాట్లాడాడు జెస్సీ. సిరి, షణ్ముఖ్, ఎన్నీ, రవి, శ్రీరామ్ చంద్రలకు పెద్దగా ఏం చెప్పని జెస్సీ, ఒక గ్రూప్ గా ఉంటోన్న సన్నీ, కాజల్, ప్రియాంక, మానస్ లకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా ప్రియాంక, కాజల్, సన్నీలకు “ఇక సపోర్ట్ చేసుకుంటూ గేమ్స్ ఆడకండి, మీ ఇండివిడ్యువల్ గేమ్ ఆడండి” అని ఇదే కామన్ పాయింట్ చెప్పాడు. తను చెప్పింది మంచి విషయమే అయినా కూడా ఈ గ్రూప్ కు మాత్రమే ఇలా చెప్పడంతో ఈ నలుగురిని కొంత విడదీసే ప్రయత్నం చేశాడా అనిపిస్తుంది. ఏదేమైనా మంచి ఫైటర్ అనిపించుకున్న జెస్సీ ఇలా ఎలిమినేట్ కాకుండా వెళ్లిపోవడం అనేది దురదృష్టకరం.


Recent Random Post: