టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్.. కెరీర్ ప్రారంభం నుంచీ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. స్టార్ డమ్ – ఇమేజ్ లను పక్కన పెట్టి మంచి కథాబలమున్న సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఓ వైపు కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను.. మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్స్ తో మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేసే వెంకీ.. తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు.
కరోనా రాకముందు ‘ఎఫ్ 2’ ‘వెంకీమామ’ వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన వెంకటేష్.. ఆ తర్వాత మూడు సినిమాలను రెడీ చేశారు. ఇప్పటికే ‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ‘దృశ్యం 2’ అనే మలయాళ రీమేక్ మూవీని రిలీజ్ కు రెడీ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా నవంబర్ 25న ఈ సినిమా విడుదల అవుతుంది.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇది సోలో మూవీ కాదు. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ‘దృశ్యం 2’ ‘ఎఫ్ 3’ రెండు సినిమాలు కూడా వెంకీ ఎప్పుడో కమిట్ అయినవి.
ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలందరూ వరుస పెట్టి సినిమాకు చేస్తున్న నేపథ్యంలో వెంకటేష్ తదుపరి మూవీ ఏంటని దగ్గుబాటి అభిమానులు ఆలోచిస్తున్నారు. అప్పట్లో డైరెక్టర్ తేజ్ తో సినిమా చేస్తారని.. ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ తో వెంకీ మామ సినిమా ఉంటుందని అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ గురించీ అధికారిక ప్రకటన రాలేదు.
ప్రస్తుతం వెంకటేష్ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తన అన్న కొడుకు రానా దగ్గుబాటి తో కలసి ఈ క్రైమ్-డ్రామా సిరీస్ చేస్తున్నారు. ఇది అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ సిరీస్ కు ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వెంకీ – రానా లకు డెబ్యూ వెబ్ సిరీస్.
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెడుతున్న వెంకీ.. ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ ఇస్తారేమో అని అభిమానులు భావిస్తున్నారు. మరి వెంకీ నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో ఉండబోతుందో చూడాలి.
Recent Random Post: