కొరటాల – బాలయ్య – ఒక మెగా హీరో.. ఇదీ కథ!!

నందమూరి బాలకృష్ణకు ఎన్ని ప్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గని హీరో. ఒక్క సూపర్ హిట్ ఇచ్చాడంటే అన్నీ పటాపంచలు కావాల్సిందే. వరసగా మూడు డిజాస్టర్ల తర్వాత బాలయ్య , బోయపాటి శ్రీనుతో జతకట్టి చేసిన చిత్రం అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమైంది. ఇక రీసెంట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రాన్ని ఓకే చేసాడు. ఆ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమాను అనుకున్నాడు బాలయ్య. త్వరలోనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు దానిపై ఆరా తీస్తే ఆ వార్తల్లో నిజముందని తేలింది. అంతే కాకుండా అది ఒక మల్టీస్టారర్ అని, ఒక మెగా హీరో అందులో మరో హీరోగా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.


Recent Random Post: