మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు వేగంగా సినిమాలు చేసేవాడు కానీ టాప్ స్థాయికి చేరుకున్నాక బాగా తగ్గించేసాడు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా ఏడాదికి ఒకట్రెండు సినిమాలే చేస్తూ వస్తున్నాడు. అయితే చిరంజీవి ఇప్పుడు పూర్తిగా తన స్టైల్ ను మార్చి వేగంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ నాలుగు చిత్రాలను ఏడాది కాలంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానున్న విషయం తెల్సిందే. అలాగే ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయనున్నాడు. అలాగే త్వరలో బాబీ దర్సకత్వంలో సినిమాను కూడా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని 2022 దసరా సమయానికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలోని భోళా శంకర్ ను సంక్రాంతి 2023కి విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ లెక్కన ఏడాది గ్యాప్ లో నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి.
Recent Random Post: