భీమ్లా వెనక్కి తగ్గాల్సిందేనా?

`వకీల్ సాబ్` బ్లాక్ బస్టర్ హిట్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సినిమా తరువాత రెట్టించిన ఉత్సాహంతో స్పీడు పెంచిన పవన్ కల్యాణ్ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర తెరకెక్కించారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీలో పవన్ కల్యాణ్ తో పాటు రానా కూడా కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి బరిలోకి దిగుతున్నామంటూ మేకర్స్ ఆల్ రెడీ డేట్ ఫిక్స్ చేసుకుని సమరానికి సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సంక్రాంతి బరిలో భారీ భారీ చిత్రాలు పోటీపడుతున్నా తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదంటూ భీమ్లా భీష్మించుకు కూర్చున్నాడు. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే ఆర్ ఆర్ ఆర్ రాధేశ్యామ్ చిత్రాలతో పాటు సైలెంట్ గా `బంగార్రాజు` కూడా బరిలోకి దిగుతున్నాడు.

ఈ నేపథ్యంలో `భీమ్లా నాయక్` ని వెనక్కి తగ్గమని.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకోమని ఒత్తిడి మొదలైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవర్ స్టార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుకునేది లేదంటూ ఖరాకండీగా చెప్పేశారట. దీంతో సంక్రాంతి బరిలో పోటీ అనివార్యంగా మారింది. `భీమ్లా నాయక్` రిలీజ్ మరో నెల రోజులు వుండటంతో మిగతా చిత్రాల నిర్మాతలు ఒత్తిడిని మరింతగా పెంచినట్టుగా కనిపిస్తోంది.

భీష్మీంచుకు కూర్చున్న భీమ్లాని ఒప్పించి రిలీజ్ ని వాయిదా వేయించాలని ఇన్పనటికే `రాధేశ్యామ్` నిర్మాతల్లో ఒకరైన వంశీ ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య దర్శకుడు త్రివిక్రమ్ ని సంప్రదిస్తున్నారట. అయితే త్రివిక్రమ్ మాత్రం తన చేతుల్లో ఏమీ లేదని తన వంత ప్రయత్నాలు మాత్రం చేస్తానని మాటిచ్చారట. భీమ్లా రిలీజ్ వాయిదా పడితే దాని వల్ల మిగతా చిత్రాల రిలీజ్ డేట్ లు మళ్లీ మార్చుకోవాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి. భీమ్లా ఎఫెక్ట్ కారణంగా ఎఫ్ 3 సర్కారు వారి పాట చిత్రాలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇన్ సైడ్ టాక్.


Recent Random Post: