బిగ్ బాస్ సీజన్ 5 లో అత్యంత ఫన్ ఎపిసోడ్ అనదగ్గ ఎపిసోడ్ ఈరోజు జరిగింది. అయితే ఎపిసోడ్ చివర్లో మళ్ళీ సన్నీ, సిరి గొడవపడి, దీన్ని కూడా సాధారణ ఎపిసోడ్ లాగే చేసేసారు. ముందుగా బిగ్ బాస్ జర్నీలో ఐకానిక్ టాస్క్ లుగా మిగిలిన కొన్నిటిని బిగ్ బాస్ ఈసారి ఫైనలిస్ట్ లకు ఇచ్చాడు. వాటిలో గెలిచిన వారికి స్పెషల్ బహుమతులు ఉంటాయి.
ముందుగా బెలూన్స్ టాస్క్ ను ఇచ్చారు. అంటే బెలూన్స్ కు గాలి కొట్టి అవి పేలేలా చేయాలి. ఎవరైతే తక్కువ సమయంలో అన్ని బెలూన్స్ ను పేలుస్తారో వారే గెలిచినట్లు. ఈ టాస్క్ లో షణ్ముఖ్ విజయం సాధించాడు. అందరికంటే ముందు బెలూన్స్ అన్నిటినీ పగలకొట్టాడు. అయితే సన్నీ ఈ విషయాన్ని నమ్మలేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా కాదన్నాడు. ఏదో మోసం చేసారు, ఫైనల్స్ కు వచ్చాక కూడా ఇలా ఆడతారు ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ పాస్ చేసాడు.
తర్వాత స్విమ్మింగ్ పూల్ టాస్క్ ను ఇచ్చారు. మానస్, షణ్ముఖ్ ఈ టాస్క్ లో పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్ లోకి దూకే ముందు ఒక్కో టిషర్ట్ ధరించాల్సి ఉంటుంది. టాస్క్ ముగిసేసరికి ఎవరైతే ఎక్కువ టిషర్ట్స్ ధరిస్తారో వారు విజయం సాధించినట్లు. దాని తర్వాత మెమరీ టాస్క్ ను ఇచ్చారు. 13 నిమిషాలను సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. 13 నిముషాలు అయ్యాయి అన్నాక బెల్ కొట్టాలి. ఈ టాస్క్ లో దగ్గరగా వచ్చాడు షణ్ముఖ్.
దాని తర్వాత సౌండ్స్ టాస్క్ ఇచ్చాడు. ప్లాస్మా లో వచ్చే వివిధ సౌండ్స్ ను గుర్తుపెట్టుకుని వాటిని బోర్డ్ మీద రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో శ్రీరామ్ చంద్ర విన్ అయ్యాడు. ఇక లాస్ట్ గా రోప్ టాస్క్ ను ఇచ్చాడు. షణ్ముఖ్, సిరి, సన్నీ ఈ టాస్క్ ను ఆడారు. ఇందులో సన్నీ విజయం సాధించగా సిరి నువ్వు సరిగ్గా వేవ్ ఇవ్వలేదు అంటూ కామెంట్ చేసింది.
గెలిచిన తర్వాత సన్నీ వచ్చి నువ్వు ఓడిపోయావుగా అంటూ కామెంట్ చేసాడు. అది సిరి తీసుకోలేకపోయింది. వీళ్లిద్దరి మధ్యా ఈ విషయంలో చాలానే వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు చాలా మాటలే అనుకున్నారు. ఈ గొడవతో నిన్నటి ఎపిసోడ్ మీద ఉన్న పాజిటివ్ ఫీలింగ్ అంతా పోయింది. ఇందులో తప్పు ఎవరిదైనా కావొచ్చు కానీ ఫైనల్స్ కు వచ్చాక కూడా ఇలా గొడవ పడటం ఎంత వరకూ కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి.
Recent Random Post: