బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ లు సుదీర్ఘ కాలం ప్రేమ లో మునిగి తేలి ఎట్టకేలకు పెళ్లి పీఠలు ఎక్కారు. వీరి పెళ్లి అయ్యి అప్పుడే నెల రోజులు పూర్తి అయ్యింది. హ్యాపీ వన్ మంత్ మై లవ్ అంటూ లవ్ ఈమోజీని షేర్ చేసిన కత్రీనా కైఫ్ ఈ ఫొటోను కూడా జత చేసింది. విక్కీ కౌశల్ కౌగిలిలో బందీ అయిన కత్రీనాను ఇలా చూసి ఆమె అభిమానులు గుండెలు అవిసేలా లోలోపల కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వారి జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా సాగుతుంది. ఇద్దరు కూడా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తమ వివాహ బంధంకు సమయం కేటాయిస్తూ ఉన్నారు.
పెళ్లి అయిన వారం రోజులకే ఇద్దరు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ముందుగానే కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ను ముగించేందుకు గాను వారు పనిలో పడాల్సి వచ్చింది. ఇద్దరికి ఇద్దరు కూడా పని పట్ల గౌరవం మరియు మక్కువ ఉన్న వారే. అందుకే ఇద్దరికి కూడా సెట్ అయ్యిందని ఆ సమయంలో కొందరు కామెంట్స్ చేశారు. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే ట్రోల్స్ అంటే వీరు ఇద్దరు కూడా మరీ కమర్షియల్ అన్నట్లుగా విమర్శించారు. ప్రశంసలు కాని విమర్శలు కాని పట్టించుకోకుండా తమ పనేదో తాము చేసుకుంటూ ఈ ఇద్దరు అప్పుడే తమ వివాహ బంధంకు నెల రోజుల సెలబ్రేషన్ చేసుకున్నారు.
కత్రీనా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. పెళ్లి తర్వాత వీరిద్దరిని కలిపి చూడటం ఇదే. అది కూడా ఫస్ట్ మంత్ స్పెషల్ గా ఈ ఫొటో రావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విక్కీ కౌగిలిలో అలా ఒదిగి పోయిన కత్రీనా చాలా క్యూట్ గా సెల్ఫీకి ఫోజ్ ఇచ్చింది. ఈ ఫొటోకు బాలీవుడ్ ప్రముఖులు అయిన వాణి కపూర్.. నేహా దుఫియా.. రణవీర్ సింగ్.. కరీనా కపూర్ ఖాన్ ఇంకా వందలాది మంది బాలీవుడ్ ఇతర రంగాల ప్రముఖులు కామెంట్ పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక విక్కీ కౌశల్ కూడా ఈ ఫొటోకు స్పందిస్తూ కత్రీనాకు కూడా హ్యాపీ వన్ మంత్ మై లవ్ అంటూ లవ్ ఈమోజీని షేర్ చేశాడు. వీరి ప్రేమను మరియు అనుబంధంను చూసి సినీ జనాలు మరియు ప్రేక్షకులు ముచ్చటగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Recent Random Post: