మెగాస్టార్ ట్రీట్ ఇప్పట్లో లేనట్లే..వచ్చే ఏడాది డౌటే!

దేశంలో వైరస్ థర్డ్ వేవ్ కొనసాగుతోంది. సినీ పరిశ్రమపై మరోసారి వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ ముగిసిన తర్వాత వాయిదా పడిన సినిమాలన్నీ మళ్లీ తెరపైకి వస్తాయి. నివేదికల ప్రకారం థర్డ్ మార్చి వరకూ కొనసాగుతోందని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న రిలీజ్ అవ్వాల్సిన `ఆచార్య` సినిమా సైతం వాయిదా వేసినట్లు ఈరోజే ప్రకటించారు. ఇదే బాటలో మరిన్ని సినిమా రిలీజ్ లు వాయిదా పడతాయి.

ఏప్రిల్ తర్వాత అవన్నీ మళ్లీ ఒక్కొక్టిగా రిలీజ్ తేదీల్ని ప్రకటించుకునే అవకాశం ఉంది. అంటే ఈసారి రిలీజ్ లు చాలా పక్కాగా ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. పరిస్థితులు ఎంత మాత్రం అనుకూలంగా లేవు కాబట్టి జనవరిలో రిలీజ్ అవ్వాలనుకున్న సినిమాలు ఏప్రిల్ తర్వాత ముందుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా ఓ ఆర్డర్ ప్రకారం సినిమాలు రిలీజ్కి వస్తాయి. అంటే `ఆచార్య` ఏ ఆగస్టులోనో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే మెగాస్టార్ నటిస్తోన్న సినిమా రిలీజ్ లు మరింత ఆలస్యం కానుందని అచనా వేయోచ్చు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో మూడు సినిమాలున్నాయి.

`గాడ్ ఫాదర్` రీమేక్ తో పాటు..బాబి సినిమా.. `భోళా శంకర్` చిత్రాలు ఉన్నాయి. మూడు సినిమాలు ప్రారంభోత్సవం పూర్తిచేసుకుని సెట్స్ లో ఉన్నాయి. కానీ షూటింగ్ మాత్రం డిలే అవుతుంది. ఆ లెక్కన చూసుకుంటే ఈ సినిమాలు షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసుకుని రిలీజ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. 2023 సంక్రాంతి కూడా చిరంజీవి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. మధ్యలో మళ్లీ కోవిడ్ కొత్త వేరియంట్లు గనుక పుట్టుకొస్తే అంతకంతకు ఆలస్యం తప్పదు.


Recent Random Post: