డిజిటల్ రిలీజ్: ఈరోజు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్న ఆరు చిత్రాలు

ప్రస్తుతం డిజిటల్ విప్లవం ఓ రేంజ్ లో ఉంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు జనాలు బాగానే అలవాటుపడ్డారు. ప్రస్తుతం కోవిడ్ కేసుల నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలను బాగానే ఆదరిస్తున్నారు. ఈ రోజు శుక్రవారం సందర్భంగా మొత్తం వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఆరు భారతీయ చిత్రాలు విడుదల కానున్నాయి.

బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ఈ సినిమా హాట్ స్టార్ లో సాయంత్రం ఆరు గంటల నుండి స్ట్రీమ్ కానుంది. అలాగే శ్యామ్ సింగ రాయ్ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుండి స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో థ్రిల్లర్ చిత్రం 36 ఫామ్ హౌజ్ స్ట్రీమ్ అవుతోంది. జివి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొంది సూపర్ హిట్ సాధించిన బ్యాచలర్ సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది.

ముదల్ నీ ముదివుమ్ నీ చిత్రం ఈరోజు నుండి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. మరోవైపు మలయాళ చిత్రం భూతకాలం సోనీ లివ్ లో అందుబాటులోకి వచ్చింది.


Recent Random Post: